ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా చోరీలకు పాల్పడుతున్న నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. జనగామకు చెందిన యువకులు పానుగంటి కృష్ణ(20), గూడెపు పృథ్వీరాజ్(20), మామిళ్లపల్లి అరవింద్(19), మరో మైనర్ బాలుడు ముఠాగా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని డీసీపీ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్&బీ విశ్రాంతి భవనం వద్ద ఎస్సై రాజేష్ నాయక్ తన బృందంతో కలిసి వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇద్దరు నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారు.
ద్విచక్ర వాహనాలను చోరీ చేస్తున్న దొంగల ముఠా అరెస్టు - jangaon district
ఇంటి ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలే లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్న నలుగురు దొంగలను జనగామ పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి 8లక్షల విలువ చేసే 6 ద్విచక్ర వాహనాలతో పాటు, దొంగతనానికి ఉపయోగించిన మరో ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ద్విచక్రవాహనాలను చోరీచేస్తున్న దొంగల ముఠా అరెస్టు
వారిని పట్టుకొని విచారించగా దొంగతనం ఒప్పుకునట్లు తెలిపారు. జల్సాలు చేయడానికి, సినిమాలు చూడడానికి, మందు తాగడానికి డబ్బులు లేకపోవడం వల్ల ఈ నేరాలకు పాల్పడుతున్నారని వెల్లడించారు. నలుగురిని జ్యుడీషియల్ రిమాండ్కు తరలించినట్లు డీసీపీ శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
ఇవీ చూడండి:హాలియా సహకార పోలింగ్లో రైతుపై చేయిచేసుకున్న ఎస్సై