బీమా ప్రతీ ఒక్కరు చేయించుకోవాలని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ అన్నారు. జనగామ జిల్లా మల్కాపేటలో ప్రమాదవశాత్తు మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులను పరామర్శించారు. బీఎల్ఆర్ ఫౌండేషన్ వారి శ్రీలక్ష్మినరసింహస్వామి బీమా ద్వారా రూ.5 లక్షల చెక్కును అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా ప్రవేశపెట్టి చాలా కుటుంబాలకు అండగా నిలబడుతున్నారని కొనియడారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజమాని, లోక్సభలో లేకున్న లోకల్లో ఉంటానని స్పష్టం చేశారు.
మృతుని కుటుంబానికి చెక్కు అందించిన మాజీ ఎంపీ - mp
జనగామ జిల్లా మల్కాపేటలో ప్రమాదవశాత్తు మరణించిన వ్యక్తి కుటుంబ సభ్యులను మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ పరామర్శించారు. బీఎల్ఆర్ ఫౌండేషన్ వారి శ్రీలక్ష్మినరసింహస్వామి బీమా ద్వారా రూ.5 లక్షల చెక్కును అందించారు.
చెక్కు అందిస్తున్న బూర నర్సయ్య గౌడ్