తెలంగాణ

telangana

ETV Bharat / state

'చట్టాలను చేయాల్సిన వారు భూ కబ్జాలు చేస్తున్నారు' - ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి వార్తలు

చట్టసభల్లో చట్టాలను చేయాల్సిన వారు భూ కబ్జాలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భూ దందాలు చేస్తున్నారని విమర్శించారు.

former mla kommuri prathap reddy fire on mla  muthireedy yadariri reddy
'చట్టాలను చేయాల్సిన వారు భూ కబ్జాలు చేస్తున్నారు'

By

Published : Dec 15, 2020, 10:52 PM IST

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి భూ దందాలకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆరోపించారు. యశ్వంతపూర్ వాగులోకి జనగామ మురుగు నీటి తరలింపును నిలిపివేయాలని గ్రామస్థులంతా తీర్మానం చేసి, హైకోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చినా.. తన స్వార్థ ప్రయోజనాల కోసం నీటిని తరలించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు.

బతుకమ్మ కుంట వద్ద తన లేఅవుట్ల కోసమే నీటిని మళ్లించే ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. వెంటనే కాలువ నిర్మాణాన్ని నిలిపివేసి గతంలో మాదిరిగా మురుగునీటిని తరలించాలని డిమాండ్ చేశారు. చేర్యాల పెద్ద చెరువు మత్తడి వద్ద రహదారి పక్కన ఉన్న భూమిని తన కూతురు, బినామీ పేరుపై పట్టా చేయించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని.. దీని వల్ల భవిష్యత్​లో చేర్యాల ముంపునకు గురయ్యే అవకాశం ఉందన్నారు.

ఇదీ చదవండి:భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ABOUT THE AUTHOR

...view details