తెలంగాణ

telangana

ETV Bharat / state

సిబ్బందికి సరకులు అందజేసిన మాజీ ఉపముఖ్యమంత్రి - కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసరాలు పంపిణీ

తనకు రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజల రుణం తీర్చుకోలేనిదని ఎమ్మెల్సీ, రాష్ట్ర మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. శుక్రవారం జనగామ జిల్లా పల్లగుట్ట గ్రామంలో కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లు, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బందికి నిత్యావసరాలు అందజేశారు.

former-deputy-chief-minister-kadiyam-srihari-distribute-the-goods-staff-at-pallagutta-jangaon
సిబ్బందికి సరకులు అందజేసిన మాజీ ఉపముఖ్యమంత్రి

By

Published : May 29, 2020, 6:19 PM IST

పలు రకాల సేవలు చేస్తున్న సిబ్బందికి సరకులు అందజేయడం ఆనందంగా ఉందని ఎమ్మెల్సీ, మాజీ ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. జనగామ జిల్లా పల్లగుట్ట గ్రామంలో లాక్​డౌన్ కారణంగా ఉపాధి లేని ఆటో కార్మికులు, ఆశా కార్యకర్తలు, పారిశుద్ధ్య సిబ్బందికి శుక్రవారం నిత్యావసరాలు పంపిణీ చేశారు. తనకు రాజకీయ జన్మనిచ్చిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ ప్రజలు కష్టకాలంలో ఉన్నప్పుడు ఆదుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని కడియం అన్నారు.

కడియం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు 2500 మందికి నిత్యావసరాలు పంపిణీ చేశామన్నారు. ఇబ్బందుల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి దాతలు ముందుకొచ్చి సహాయ సహకారాలు అందించాలని కోరారు.

ఇదీ చూడండి :పత్తి గోదాము నుంచి ఎగిసిపడ్డ పొగలు

ABOUT THE AUTHOR

...view details