'జనగామలో జెండా ఆవిష్కరించిన జడ్పీ ఛైర్మన్' - JANAGAMA DISTRICT HEAD QUARTER
జనగామ జిల్లా కేంద్రంలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ గద్దల పద్మ హాజరయ్యారు.
జిల్లా సాధించిన వార్షిక ప్రగతిని వివరించిన జడ్పీ ఛైర్ పర్సన్
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మకాంచ మినీ స్టేడియంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జడ్పీ ఛైర్ పర్సన్ గద్దల పద్మ అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన అనంతరం జాతీయ జెండాను ఎగురవేశారు.
ఈ సందర్భంగా జిల్లా సాధించిన వార్షిక ప్రగతిని ఆమె వివరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, డీసీపీ శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.