తెలంగాణ

telangana

పెంబర్తి సర్పంచ్​ సస్పెన్షన్​పై మాటల యుద్ధం

జనగామ జిల్లా పెంబర్తి లో సర్పంచ్ సస్పెన్షన్​పై ఇంకా మాటల యుద్ధం కొనసాగుతోంది. విలేకరుల సమావేశం నిర్వహించి.. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించారు. రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవ తీవ్రతరం కావడం వల్ల పోలీసులు రంగప్రవేశం చేశారు. ఇరువర్గాలను శాంతింపజేసి సమస్యను సద్దుమణిగించారు.

By

Published : May 19, 2020, 1:57 PM IST

Published : May 19, 2020, 1:57 PM IST

పెంబర్తి సర్పంచ్​ సస్పెన్షన్​పై మాటల యుద్ధం
పెంబర్తి సర్పంచ్​ సస్పెన్షన్​పై మాటల యుద్ధం

జనగామ జిల్లా పెంబర్తి సర్పంచ్​.. నిధుల దుర్వినియోగం కింద సస్పెండ్​ అయ్యారు. దీనిపై సర్పంచ్​ అంబాల ఆంజనేయులు విలేకరుల సమావేశం నిర్వహించి.. జడ్పీటీసీ-పీఏసీఎస్‌ ఛైర్మన్‌ దంపతులు.. తనను రాజకీయంగా అణగదొక్కేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

దానికి స్పందించిన జడ్పీటీసీ నిమ్మతి దీపిక, పీఏసీఎస్‌ జనగామ ఛైర్మన్‌ నిమ్మతి మహేందర్‌రెడ్డి దంపతులు కూడా విలేకరుల సమావేశం నిర్వహించి, సర్పంచ్​ నిధులు దుర్వినియోగం చేశారని విమర్శించారు. అది నిరూపించకుంటే రాజీనామా చేస్తామన్నారు.

"నిన్న సర్పంచ్​గా సస్పెండ్​ ఆర్డర్​ రాగానే విలేకరుల సమావేశం నిర్వహించారు. సర్పంచ్​ ఆంజనేయులు.. మాపైన లేనిపోని అబాండాలు వేశారు. నేను 4 నెలల క్రితం నిధులు దుర్వినియోగం చేశారని ఒక ఫిర్యాదు ఇచ్చాను. నేను ఫిర్యాదిచ్చాననే వారు తొలగించరు కదా..! విచారణ చేశాకే సస్పెండ్​ చేస్తారు కదా..!"

-నిమ్మతి దీపిక, జడ్పీటీసీ

పెంబర్తి సర్పంచ్​ సస్పెన్షన్​పై మాటల యుద్ధం

సమాచారం తెలుసుకున్న సర్పంచ్​ వర్గీయులు అక్కడకు చేరుకొని జడ్పీటీసీ, పీఏసీఎస్‌ ఛైర్మన్‌ను నిలదీశారు. ఈక్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోలీసులు అక్కడకు చేరుకొని సమస్యను సద్దుమణిగించారు.

ఇవీ చూడండి:'బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం'

ABOUT THE AUTHOR

...view details