తెలంగాణ

telangana

ETV Bharat / state

తండ్రి మరణం: పదో తరగతి విద్యార్థికి విధి పరీక్ష - father_dead_10th_exam

కాసేపట్లో పదో తరగతి పరీక్ష. కానీ ఇంతలోనే ఆ విద్యార్థికి విధి పరీక్ష పెట్టింది. మంచి మార్కులు తెచ్చుకోవాలని బాగా చదువుకున్నాడు. ఇంతలో తండ్రి ఆత్మహత్య చేసుకున్న వార్త వచ్చింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ముంచుకొస్తున్న కొండంత దుఃఖాన్ని దిగమింగి పదో తరగతి పరీక్షకు హాజరయ్యాడా విద్యార్థి. ఇది జనగామలో జరిగిన విషాద ఘటన.

దుఃఖాన్ని దిగమింగి పరీక్షకు...

By

Published : Apr 3, 2019, 5:35 PM IST

దుఃఖాన్ని దిగమింగి పరీక్షకు...
జనగామ జిల్లా గానుగ్​పహాడ్ గ్రామంలో వంగ వెంకటయ్య అనే గీత కార్మికుడు ఆర్థిక ఇబ్బందులతో మంగళవారం రాత్రి ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కొడుకు ప్రణయ్ పదో తరగతి పరీక్షలు రాస్తున్నాడు. వెంకటయ్య మరణవార్త విన్న కుటుంబ సభ్యులు కుప్పకూలిపోయారు.తండ్రి మరణం కలిచి వేస్తుండగా.. మరోవైపు పదో తరగతి చివరి పరీక్ష... ఎటూ పాలుపోని స్థితిలో ఉన్న ప్రణయ్​ని స్థానికులు ఓదార్చి మనోధైర్యం నింపి పరీక్ష కేంద్రానికి పంపించారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details