నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు చేసిన ధాన్యం, మొక్కజొన్న నిల్వలను వెంటనే గోదాములకు తరలించాలంటూ.. రైతులు ఆందోళన నిర్వహించారు. జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లోని కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు నిరసన వ్యక్తం చేశారు. రోడ్లపైకి వచ్చి రాస్తారోకో నిర్వహించారు.
ధాన్యం తరలించాలంటూ రైతుల ఆందోళన - lock down update
జనగామ జిల్లా చిల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో రైతులు ఆందోళన నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు చేసి నిల్వ ఉంచిన ధాన్యాన్ని గోదాంలకు తరలించాలని డిమాండ్ చేశారు. నెల రోజులుగా కేంద్రాల వద్దనే పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
![ధాన్యం తరలించాలంటూ రైతుల ఆందోళన farmers protest at ikp centers in janagama district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7318453-168-7318453-1590233725980.jpg)
ధాన్యం తరలించాలంటూ రైతుల ఆందోళన
నెల రోజులుగా కొనుగోలు కేంద్రాల వద్దనే పడిగాపులు కాస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తాము తెచ్చిన ధాన్యం, మొక్కజొన్నను కొనుగోలు చేయటం లేదని ఆరోపించారు. కొనుగోలు కేంద్రాలకు వాహనాలు రాకపోవడం వల్ల తాము తీసుకొచ్చిన ధాన్యం వానకు తడుస్తోందని ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగినన్ని వాహనాలను ఏర్పాటు చేసి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తరలించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.