జనగామ జిల్లా లింగాలఘన్పూర్ మండలం కళ్లెం గ్రామస్థులు కలెక్టరేట్ ఎదుట ధర్నాకి దిగారు. కళ్లెం, మాణిక్యపురం గ్రామాల వీఆర్వో సంపత్‌ను వెంటనే సస్పెండ్ చేయాలంటూ నినాదాలు చేశారు. రెండు నెలల నుంచి విధులకు హాజరు కాకుండా రైతులను వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాలు చేయిస్తానని చెప్పి డబ్బులు వసూలు చేసి పాసు పుస్తకాలు ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడని ఆరోపించారు. అన్నదాతలను అష్టకష్టాలు పెడ్తున్న వీఆర్వోపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు.
'వీఆర్వో సంపత్‌ను సస్పెండ్ చేయాలి' - DHARNA
జనగామ జిల్లా కళ్లెం గ్రామ వీఆర్వోను సస్పెండ్ చేయాలంటూ గ్రామస్థులు కలక్టేర్ ఎదుట ధర్నా చేశారు.
'వీఆర్వో సంపత్‌ను సస్పెండ్ చేయాలి'
Last Updated : Jul 9, 2019, 3:19 PM IST