తెలంగాణ

telangana

ETV Bharat / state

జనగామలో కల్తీ మద్యం.. నీళ్లు కలిపి అమ్మకం..

జనగామ జిల్లా తరిగొప్పులలో ఉన్నత అధికారుల ఆదేశాలతో వరంగల్​ ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టోరేట్​ సీఐ శ్రీనివాస్ గౌడ్​​ దాడులు చేశారు. శ్రీనివాస వైన్స్​లో కల్తీ మద్యాన్ని సీజ్​ చేసి.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.

By

Published : Aug 20, 2019, 5:29 PM IST

జనగామలో కల్తీ మద్యం.. నీళ్లు కలిపి అమ్మకం..

జనగామలో కల్తీ మద్యం.. నీళ్లు కలిపి అమ్మకం..

జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలోని శ్రీనివాస వైన్స్​లో వరంగల్ ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కల్తీ మద్యాన్ని సీజ్​ చేసి నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఉన్నత అధికారుల ఆదేశాలతో దాడులు చేశామని సీఐ శ్రీనివాస్​ గౌడ్​ తెలిపారు. ఉదయం నుంచి తనిఖీలు నిర్వహిస్తున్నామని.. మద్యం సీసాల్లో నీళ్లు కలిపి కల్తీ చేస్తున్నట్లు వెల్లడైందన్నారు. ఇలా కల్తీ చేసిన లిక్కర్​ని పర్మిట్​ రూంలో విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details