ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారి వెంట గ్రామాలలో మద్యం బెల్టు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జనగాం జిల్లా స్టేషన్ ఘనపూర్ ఆబ్కారీ సీఐ ముకుంద రెడ్డి తెలిపారు. పల్లెల్లో సర్కారు నిబంధనలకు విరుద్ధంగా మద్యం దుకాణాలు నిర్వహిస్తుండటం వల్ల చాలామంది మద్యానికి బానిసలు అవుతున్నారని పేర్కొన్నారు.
'మద్యం బెల్టు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు' - మద్యం గొలుసు దుకాణాలు
గ్రామాలలో మద్యం బెల్టు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని స్టేషన్ ఘనపూర్ ఎక్సైజ్ సీఐ హెచ్చరించారు.
!['మద్యం బెల్టు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు' jangaon district latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7302247-202-7302247-1590139299293.jpg)
jangaon district latest news
మందుబాబులు ఇళ్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నారని తెలిపారు. ఇక ముందు మద్యం గొలుసు దుకాణాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. లక్ష రూపాయల జరిమానాతో పాటుగా ఒక సంవత్సరం పాటు జైలు శిక్ష కూడా విధించనున్నట్లు చెప్పారు.