తెలంగాణ

telangana

ETV Bharat / state

తెరాస సహనాన్ని పరీక్షించవద్దని బండి సంజయ్​కు ఎర్రబెల్లి వార్నింగ్ - జనగామ జిల్లా వార్తలు

errabelli warning to bandi sanjay దేవరుప్పుల తరహాలో భాజపా మరోసారి గూండాగిరికి దిగితే ఊరుకునేది లేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హెచ్చరించారు. తెరాస సహనాన్ని పరీక్షించవద్దని సూచించారు. భాజపా గూండాలు తెరాస కార్యకర్తలపైనే కాదు సామాన్యులపై కూడా దాడి చేశారని.. ఈ ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

Errabelli
Errabelli

By

Published : Aug 15, 2022, 7:23 PM IST

Updated : Aug 15, 2022, 8:13 PM IST

errabelli warning to bandi sanjay: భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ 500 మంది గూండాలతో పాదయాత్ర నిర్వహిస్తున్నాడని, తెరాస కార్యకర్తలే కాక సామాన్య జనాల పైన కూడా రాళ్లు, రాడ్లు, కర్రలతో దాడులు చేయిస్తున్నాడని ఆరోపించారు. దేవరుప్పులలో జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు జరుగుతున్న రోజే బండి సంజయ్ ఇలాంటి హింసాత్మక ఘటనలకు పాల్పడటం విచారకరమన్నారు. ఈ ఘటనతో భాజపా వైఖరి మరోసారి బయట పడిందని, ప్రజల్లో సానుభూతి పొందడానికే ఇలాంటి ఘటనలకు పాల్పడుతోందని మండిపడ్డారు.

ఇవాళ్టి ఘర్షణలో గాయపడిన తెరాస శ్రేణులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పరామర్శించారు. జనగామలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కార్యకర్తల నుంచి ఘటనకు సంబంధించి వివరాలు తెలుసుకున్నారు.

బండి సంజయ్ వెంట ఉన్న 500 మంది గూండాలు రాళ్లు, కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురు మా కార్యకర్తలు గాయపడ్డారు. దాడిలో సత్తెమ్మ అనే సామాన్యురాలు కూడా గాయపడింది. జాతీయ జెండా ఆవిష్కరణ కోసం వచ్చిన ఆమెపై కూడా దాడి చేశారు. ఈ విషయంలో పోలీసుల స్పందన కూడా సరిగా లేదు. ఈ ఘటనను నేను డీజీపీ దృష్టికి తీసుకెళ్తా. ఎర్రబెల్లి దయాకర్​రావు, రాష్ట్రమంత్రి

దేవరుప్పులలో గాయపడిన తెరాస శ్రేణులకు మంత్రి ఎర్రబెల్లి పరామర్శ

ఇవీ చదవండి..

Last Updated : Aug 15, 2022, 8:13 PM IST

ABOUT THE AUTHOR

...view details