జనగామ జిల్లాలో వలస కూలీలకు బియ్యం, నగదును ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డితో కలిసి కలెక్టర్ నిఖిల పంపిణీ చేశారు. జిల్లా పరిధిలో వలసదారులు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ స్పష్టం చేశారు. 2,445 మంది కూలీలకు ఒక్కొక్కరికీ 12 కిలోల బియ్యం, రూ.500 చొప్పున నగదు పంపిణీ చేశారు.
జనగామలో వలస కూలీలకు బియ్యం నగదు పంపిణీ - జనగామలో వలస కూలీలకు ఆర్థిక సాయం
లాక్డౌన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు జనగామ జిల్లాలో వలస కూలీలకు ఆర్థిక సాయం అందజేశారు. కలెక్టరేట్ ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో 2,445 మంది కూలీలకు ఆర్థిక సాయాన్ని ఎమ్మెల్యే యాదగిరి రెడ్డితో కలిసి కలెక్టర్ నిఖిల పంపిణీ చేశారు.
వలస కూలీలకు బియ్యం నగదు పంపిణీ
ప్రజలంతా కరోనా వ్యాప్తి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రభుత్వ సూచనలు పాటించాలని... స్వీయ నిర్బంధంలో ఉండాలని కోరారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కెమికల్ స్ప్రే చేయించారు.
ఇవీచూడండి:తెలంగాణలో ఆరుకు చేరిన కరోనా మృతుల సంఖ్య
Last Updated : Mar 31, 2020, 10:47 PM IST