తెలంగాణ

telangana

ETV Bharat / state

'నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు' - జనగామలోని విత్తన దుకాణాల్లో తనిఖీలు నిర్వహించిన డీసీసీ శ్రీనివాస్​రెడ్డి వార్తలు

జనగామలోని విత్తనాలు, ఎరువుల దుకాణాల్లో డీసీపీ శ్రీనివాస్​రెడ్డి తనిఖీలు నిర్వహించారు. కల్తీ విత్తనాలు అమ్మే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

dcp srinivas reddy conducted checks at seed stores in jangaon
'కల్తీ విత్తనాలు అమ్మితే చర్యలు తప్పవు'

By

Published : Jun 7, 2020, 4:49 PM IST

కల్తీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు తప్పవని జనగామ డీసీపీ శ్రీనివాస్​రెడ్డి హెచ్చరించారు. జనగామలోని విత్తనాలు, ఎరువుల దుకాణాలను తనిఖీ చేసిన ఆయన.. దుకాణదారులకు, రైతులకు పలు సూచనలు చేశారు.

నిపుణులు, వ్యవసాయ అధికారులు సూచించిన ఉత్తమ ప్రమాణాలు గల నాణ్యమైన విత్తనాలనే విక్రయించాలని దుకాణదారులకు సూచించారు. అనుమతి పొందిన దుకాణదారులు మాత్రమే విత్తనాలను అమ్మాలని, అనుమతి లేని వారు విక్రయిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులు కొనుగోలు చేసిన ప్రతి విత్తనాలు, ఎరువులకు సంబంధించిన బిల్లులను భద్రంగా దాచుకోవాలని, సరైన దిగుబడి రానట్లయితే సంబంధిత దుకాణంపై కేసు నమోదు చేయొచ్చని సూచించారు.

ఇదీచూడండి: 'వారానికి ఓ రోజు ఓ పదినిమిషాలు ఆ పనికి కేటాయించండి'

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details