తెలంగాణ

telangana

ETV Bharat / state

Crops Damage in Telangana : అకాల వర్షం.. అన్నదాతల పాలిట శాపం.. ఆదుకోవాలంటూ విన్నపం - అకాల వర్షం

Crops Damage due to Hail Rains in Telangana: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కురిసిన అకాల వర్షాలు, వడగండ్లు.. అన్నదాతలను తీవ్రంగా దెబ్బతీశాయి. నోటికాడికి వచ్చిన పంట... చేతికి రాకపోవడంతో లబోదిబోమంటున్నారు. ప్రధానంగా వరి... మొక్కజొన్న, మామిడి పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కలాల్లో ఆరబోసిన ధాన్యం, మక్కలు నీటిపాలయ్యాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ రైతులు వేడుకుంటున్నారు.

Crops Damaged
Crops Damaged

By

Published : Apr 24, 2023, 9:27 AM IST

అకాల వర్షం.. అన్నదాతల పాలిట శాపం.. ప్రభుత్వమే ఆదుకోవాలంటూ విన్నపం

Crops Damage due to Hail Rains in Telangana: అకాల వర్షాలు.. వడగళ్ల వాన.. రైతులను కోలుకోలేని దెబ్బతీశాయి. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షంతో.. రైతులు తీవ్రంగా నష్టపోయారు. వరి, మిరప, మామిడి, టమాటో తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. బీజేపీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండలంలో.. వరి పంట దారుణంగా దెబ్బతింది. ఐనాపూర్‌లో తెలంగాణ రైతు సంఘం నాయకులు పర్యటించి.. నష్టపోయిన రైతుల పంట రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేశారు.

నేలరాలిన మామిడి, వరి.. లబోదిబోమంటున్న రైతులు: యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలంలోని ధాన్యం, మామిడి తోటలలోని మామిడికాయలు పూర్తిగా నేలరాలిపోయాయి. రైతుల బాధ వర్ణనాతీతంగా మారిపోయింది. మోత్కూర్ మండలంలో అకాల వర్షానికి.... వరి నేల రాలడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. దాచారంలో ఏర్పాటు చేసిన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రంలో... వర్షపు నీటికి పంట కొట్టుకుపోయింది.

ప్రభుత్వమే ఆదుకోవాలంటూ అన్నదాతల ఆవేదన: జనగామ జిల్లాలో అకాల వర్షాలు.. రైతులను నిండా ముంచాయి. జనగామ మండలం పెద్ద పహాడ్‌లో దెబ్బతిన్న పంటలను మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ కార్యాలయంలో.. మంత్రి సమీక్ష నిర్వహించారు. అకాల వర్షానికి నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య డిమాండ్‌ చేశారు. జనగామ, సిద్దిపేట జిల్లాలో దెబ్బతిన్న పంటలను పొన్నాల పరిశీలించి.. రైతులను ఓదార్చారు. రాష్ట్ర ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ... అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుల ఆందోళనకు ప్రతిపక్షాల మద్దతు: జనగామ జిల్లాలో బచ్చన్నపేట, జనగామ, రఘునాథపల్లి మండలాల్లో 42 గ్రామాల్లో వరి పంట దెబ్బతింది. బచ్చన్నపేట చౌరస్తాలో రైతులు రాస్తారోకో చేశారు. నష్టపోయిన ఎకరానికి 40వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేశారు. రైతుల ఆందోళనకు కాంగ్రెస్, బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. రైతులతో మాట్లాడేందుకు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అక్కడికి రావడంతో.. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అక్కడి నుంచి వెళ్లిపోయారు. బీజేపీ నాయకులు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో... స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.

మార్కెట్​కు సెలవులు.. రైతులకు కన్నీళ్లు: వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో ఉరుములు మెరుపులతో కురిసిన భారీ వర్షం కురిసింది. నర్సంపేట ప్రధాన వ్యవసాయ మార్కెట్‌కు... యాసంగి జొన్నలు అధికంగా వచ్చాయి. తేమ తగ్గించడానికి కోసం రైతులు ఆరబోసుకున్నారు. అకస్మాత్తుగా గాలివానతో కూడిన వర్షం రావడంతో... ఆరబోసిన మక్కలు వర్షాపు నీటికి కొట్టుకుపోయాయి. రెండు రోజులు మార్కెట్‌కు సెలవులు కావడంతో... కోనుగొళ్లు నిలిచి పోయాయని రైతులు లబోదిమంటున్నారు.

అకాల వర్షం.. అన్నదాతల పాలిట శాపం: మహబూబాబాద్ జిల్లాలో అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచాయి. మామిడి కాయలు నేలరాలాయి. వరి, మొక్కజొన్న, పంటలు నేలకొరిగాయి. ఆరుగాలం కష్టించి పండించిన పంటను.. కేసముద్రంలో అమ్ముకునేందుకు మార్కెట్‌కు తీసుకురాగా అకాల వర్షానికి కొట్టుకుపోయాయి. నరసింహులపేట మండలంలో ఓ పౌల్ట్రీ ఫామ్ నేలమట్టం అయ్యింది. హనుమకొండ జిల్లా పరకాల డివిజన్ వ్యాప్తంగా.. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ఈదురు గాలులతో కూడిన వర్షం వల్ల వరి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. ప్రభుత్వమే తమను ఆదుకోవాలంటూ... రైతులు వేడుకుంటున్నారు.

గాలి వాన బీభత్సం.. నేలకొరిగిన చెట్లు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు, టేకులపల్లి మండలంలో జోరు వానతో పాటు వడగండ్లు పడ్డాయి. ఖమ్మం జిల్లాలో ఒక్కసారిగా అకాల వర్షం కురిసింది. గాలి వానతో పాటు వడగండ్లు పడ్డాయి. జిల్లాలోని పలు మండలాల్లో మొక్కజొన్న, మామిడి, ఇతర ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం ఏర్పడింది. హుజూర్‌నగర్‌ మండలం వేపల సింగారంలో గాలి దుమారానికి.. ధ్వజ స్తంభం, రహదారుల వెంట చెట్లు విరిగిపడ్డాయి. ఐకేపీ కేంద్రాలలో ధాన్యం తడిసి ముద్దయింది.

ఇవీ చదవండి:

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details