జనగామ జిల్లా కేంద్రంలో.. ఏసీ రెడ్డి కాలనీ భూ నిర్వాసితులు చేపట్టిన దీక్షకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మద్దతు తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే బాధితులకు రెండు పడక గదులను అందజేయడం లేదని విమర్శించారు. సమస్యపై సీఎంకు లేఖ రాసి.. పరిష్కారానికి కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు.
భూ నిర్వాసితుల దీక్షకు తమ్మినేని మద్దతు - జనగామ కలెక్టరేట్
జనగామ జిల్లా కేంద్రం బాణపురంలోని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ఎదుట.. ఏసీ రెడ్డి కాలనీ భూ నిర్వాసితులు ఆందోళన చేపట్టారు. కలెక్టరేట్ నిర్మాణంలో భాగంగా ఇళ్లు కోల్పోయిన తమకు.. నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఆవాసం కల్పించలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. వీరి దీక్షకు మద్దతు తెలిపారు.
land occupants protest
కలెక్టరేట్ నిర్మాణంలో భాగంగా ఇళ్లు కోల్పోయిన తమకు.. నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఆవాసం కల్పించలేదంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ఓపిక నశించి.. తామే ఇళ్లను ఆక్రమించుకున్నామన్నారు. వీలైనంత త్వరగా తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఇదీ చదవండి:రాష్ట్రంలో కొత్తగా 1,798 కరోనా కేసులు, 14 మంది మృతి