జనగామ జిల్లాలో మరో కరోనా కేసు నమోదైంది. మరిగడికి చెందిన మహిళ అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె రక్త నమూనాలను కరోనా నిర్ధరణ పరీక్షకు పంపించగా పాజిటివ్ వచ్చినట్లు జిల్లా వైద్యాధికారి మహేందర్ తెలిపారు.
కరోనాతో మహిళ మృతి.. అంత్యక్రియల్లో గ్రామస్థులు! - జనగామ జిల్లాలో కరోనా మృతి
జనగామ జిల్లా మరిగడిలో అనారోగ్యంతో మృతి చెందిన మహిళ అంత్యక్రియల్లో గ్రామస్థులంతా పాల్గొన్నారు. ఆమె రక్తనమూనాలు పరీక్షించి మహిళ కరోనాతో మృత్యువాత పడినట్లు వైద్యులు తెలియజేయగా గ్రామ ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు.
జనగామ జిల్లాలో కరోనా మృతి
మహిళ కరోనాతో మృతి చెందిందనే విషయం తెలియక గ్రామస్థులంతా ఆమె అంత్యక్రియల్లో పాల్గొన్నారు. అధికారుల ద్వారా విషయం తెలుసుకున్న గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. మృతురాలి బంధువులతోపాటు అంత్యక్రియల్లో పాల్గొన్న వారిని హోం క్వారంటైన్‌కు తరలిస్తామని వైద్యాధికారి వెల్లడించారు. ఇప్పటికే జిల్లాలో ఇద్దరు కరోనా పాజిటివ్‌తో ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
- ఇవీ చూడండి:రాష్ట్రంలో ఈరోజు 206 మందికి కరోనా