తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరో డ్రైవర్​కూ కరోనా - corona positive to MLA Muttireddy Yadagiri news

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరో డ్రైవర్​కూ కరోనా నిర్ధరణ అయింది. ఇప్పటివరకు ఎమ్మెల్యేతో సహా ఆరుగురికి కరోనా పాజిటివ్​ వచ్చింది.

corona-positive-to-mla-muttireddy-yadagiri-reddy-another-driver
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి మరో డ్రైవర్​కూ కరోనా

By

Published : Jun 16, 2020, 10:33 AM IST

జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి గత మూడు రోజుల క్రితం చికిత్స పొంది డిశ్చార్జ్​ అయ్యారు. హైదరాబాద్​ హబ్సిగూడలోని తన నివాసానికి చేరుకున్నట్లు ఆయన సతీమణి పద్మాలతరెడ్డి తెలిపారు. తన నివాసంలో ఆయనతో పాటు... ఆమె హోం క్వారెంటైన్​లో ఉన్నట్లు స్పష్టం చేశారు.

తమతో పాటు నిర్ధరణ అయిన మరో ముగ్గురు తమ ఫంక్షన్​ హాల్లోని రూముల్లో హోం క్వారెంటైన్​లో ఉన్నట్లు చెప్పారు. ఇవాళ వచ్చిన ఫలితాల్లో తమ మరో డ్రైవర్​కు కూడా కరోనా పాజిటివ్​గా నిర్ధరణ అయిందని... తెలిపారు. ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వివరించారు. ఇప్పటి వరకు ఎమ్మెల్యే, ఆయన సిబ్బందిలో ఆరుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది.

ఇదీ చూడండి:భారత్‌, చైనా సరిహద్దు వివాదం.. చర్చలతోనే పరిష్కారం

For All Latest Updates

TAGGED:

corona news

ABOUT THE AUTHOR

...view details