మల్కాపూర్ మహిళకు కరోనా పాజిటివ్ - Migrant labours Corona Positive cases in Telangana state
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న కేసుల సంఖ్య మాత్రం తగ్గటం లేదు. ఇవాళ జనగామ జిల్లాలో మరో కరోనా పాజిటివ్ కేసు నమోదైయింది. తాజాగా మరో కేసు నమోదు కావటంతో జిల్లాలో కేసుల సంఖ్య ఆరుకు చేరింది.
మల్కాపూర్ మహిళకు కరోనా పాజిటివ్
జనగామ జిల్లా చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన వలస కూలీకి కరోనా పాజిటివ్ వచ్చిందని వైద్యులు తెలిపారు. మహారాష్ట్ర బీమండి నుంచి వచ్చిన వలస కూలీకి కరోనా లక్షాణాలు ఉన్నాయని గమనించిన అధికారులు.. మహిళను హైదరాబాద్ కోఠి ఫీవర్ ఆసుపత్రికి తరలించారు. కోవిడ్-19 పరీక్షలు నిర్వహించగా వలస కూలీకి కరోనా పాజిటివ్ నిర్థారణ అయినట్లు అధికారులు తెలిపారు.