జనగామ జిల్లా వ్యాప్తంగా కరోనా కేసులు రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. కొన్ని రోజులుగా 10 కంటే తక్కువ కేసులు నమోదు అవుతుండగా... గురువారం ప్రకటించిన హెల్త్ బులిటెన్ ప్రకారం 22 కేసులు నమోదయ్యాయి. తాజాగా జనగామ మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్ యాదవ్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్టు వైద్యాధికారులు తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తుండటం వల్ల జిల్లాలో పలు చోట్ల వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకే దుకాణాలను తెరుస్తున్నారు. ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
జనగామ మున్సిపల్ కమిషనర్‌కు కరోనా పాజిటివ్ - జనగామ కరోనా వార్తలు
జనగామ జిల్లాలో గురువారం నాడు 22 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మున్సిపల్ కమిషనర్ నోముల రవీందర్‌కు వైరస్ సోకినట్టు వైద్యాధికారులు తెలిపారు. జిల్లావ్యాప్తంగా వ్యాపారులు స్వచ్ఛందంగా లాక్డౌన్ పాటిస్తున్నారు.
జనగామ మున్సిపల్ కమిషనర్‌కు కరోనా పాజిటివ్