రైతును సగౌరవంగా సమాజంలో నిలపాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. జనగామలో జరిగిన నియంత్రిత పంటల సాగువిధానంపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. ప్రభుత్వం సూచింటినట్లు చేస్తే రైతులు లాభసాటిగా మారుతారని పేర్కొన్నారు. రైతులకు కావాల్సిన పనులు ముఖ్యమంత్రి చేస్తున్నారని... సీఎం ఏ మంచి పని తలపెట్టినా కొందరు విమర్శిస్తున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. సదస్సులో మంత్రి ఎర్రబెల్లి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.
రైతును సగౌరవంగా నిలపాలన్నదే కేసీఆర్ లక్ష్యం: శ్రీనివాస్ గౌడ్ - శ్రీనివాస్ గౌడ్ తాజా వార్తలు
వచ్చే వర్షాకాలం నుంచి అమలు చేయాలనుకుంటున్న నియంత్రిత సాగు విధానంపై ప్రజాప్రతినిధులు, అధికారులు విస్తృత అవగాహన కల్పిస్తున్నారు. జనగామలో జరిగిన నియంత్రిత పంటల సాగువిధానంపై అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు.
సమాజంలో రైతును సగౌరవంగా నిలపాలన్నదే సీఎం లక్ష్యం: శ్రీనివాస్ గౌడ్