కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలతో రైతులను వారి పొలాల్లో కూలీలుగా మార్చి... కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూరేలా చేసిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ విమర్శించారు. పంటలకు మద్దతు ధర పెంచి, రైతుల ఆదాయాన్ని రెండింతలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి భాజపా అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జనగామ జిల్లా కేంద్రంలో నిరసన చేపట్టారు. గాంధీ జయంతి సందర్భంగా ముందుగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
'రైతులు కూలీలుగా... కార్పొరేట్ సంస్థలకు లబ్ధి'
పంట మద్దతు ధర పెంచి, రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని భాజపా అధికారంలోకి వచ్చిందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజ్ శ్రవణ్ గుర్తు చేశారు. నూతన చట్టాలతో రైతులను కూలీలుగా మార్చి... కార్పొరేట్ సంస్థలకు లబ్ధి చేకూర్చేలా చేశారని ఆరోపించారు. 80 కోట్ల ప్రజలకు సంబంధించిన బిల్లుపై పార్లమెంట్‌లో ఒక్కరోజే చర్చలు జరపడం సరికాదన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు.
కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన వ్యవసాయ చట్టాలతో రైతులకు ఎలాంటి లాభం లేకపోగా, నష్టం కల్గించేలా ఉందని ఆయన ఆరోపించారు. 80 కోట్ల ప్రజలకు సంబంధించిన బిల్లుపై పార్లమెంట్‌లో సరైన చర్చలు జరపకుండా ఒక్కరోజులోనే చర్చించి, ఆమోదించడం దారుణమన్నారు. సంఖ్యా బలం ఉండడం వల్ల బిల్లును ఆమోదింపజేసుకున్నారని విమర్శించారు. రాజ్యసభలో బలం లేకున్నా... కాంగ్రెస్ సభ్యులను బయటకు పంపి మరీ ఆమోదించారని ఆరోపించారు. ఈ చట్టాలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ ఆందోళన బాట