జనగామ జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆధ్వర్యంలో జిల్లా డీసీసీ అధ్యక్షులు జంగా రాఘవరెడ్డి సమక్షంలో సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంకు చెందిన వంద మంది తెరాస కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దొడ్డిదారిన ఏర్పడిన తెరాస ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల వల్లే ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని పొన్నాల వ్యాఖ్యానించారు. ప్రభుత్వం నినాదాలకే పరిమితం అయింది తప్ప... విధానాలను పాటించడం లేదని ఆయన విమర్శించారు. ఇంటర్మీడియట్ పరీక్ష పలితాల్లో అవకతవకలు జరిగాయని, 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న ముఖ్యమంత్రి స్పదించడం లేదని పొన్నాల మండిపడ్డారు.
పొన్నాల సమక్షంలో కాంగ్రెస్లో చేరిన 100 మంది కార్యకర్తలు - congress party
సిద్దిపేట జిల్లాకు చెందిన వంద మంది తెరాస కార్యకర్తలు మాజీ టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ఆధ్యర్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తెరాస నినాదాలకే పరిమతమైందని పొన్నాల వ్యాఖ్యానించారు.
పొన్నాల ఆధ్వర్యంలో కాంగ్రెస్లో చేరిక