రైతులకు మద్దతుగా ఆందోళనకు వెళ్తున్న తనను అరెస్ట్ చేయడం సరైన పద్ధతి కాదని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. భారత్ బంద్కు రాష్ట్ర ప్రభుత్వం అనుమతినిచ్చిందని గుర్తు చేశారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఎన్ఎస్యూఐ తలపెట్టిన నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న ఆయనను జనగామ జిల్లా పెంబర్తి వద్ద పోలీసులు అరెస్ట్ చేసి... లింగాల ఘనపూర్ స్టేషన్కు తరలించారు.
అప్పుడు మద్దతిచ్చిన తెరాస... ఇప్పుడు అరెస్ట్ చేయడం సరికాదు: వీహెచ్ - telangana latest news
కేయూలో ఎన్ఎస్యూఐ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి వెళ్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావును పెంబర్తి వద్ద పోలీసులు అరెస్ట్ చేశారు. రైతులకు తెరాస మద్దతిచ్చిందని... తనను అరెస్ట్ చేయడం సరికాదని అసహనం వ్యక్తం చేశారు. సాగు చట్టాలను అన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.
అప్పుడు మద్దతిచ్చిన తెరాస... ఇప్పుడు అరెస్ట్ చేయడం సరికాదు: వీహెచ్
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను అన్ని పార్టీలు ముక్త కంఠంతో వ్యతిరేకిస్తునాయని అన్నారు. భారత్ బంద్కు అప్పుడు తెరాస అనుమతినిచ్చిందని... ఇప్పుడు తనను అరెస్టు చేయడం ఎందుకని ప్రశ్నించారు.
ఇదీ చదవండి:సాగు చట్టాల రద్దు కోసం రైతుల నిరాహార దీక్ష
Last Updated : Dec 21, 2020, 12:08 PM IST