తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆ ఎమ్మెల్యే కారణంగానే బాధితులకు అన్యాయం: కాంగ్రెస్​

ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కారణంగానే భూమి కోల్పోయిన వారికి అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ నాయకులు బీర్ల అయిలయ్య ఆరోపించారు. తెలంగాణాలో కొన్ని ప్రాంతాలనే అభివృద్ధి చేస్తోన్న ప్రభుత్వం మిగతా ప్రాంతాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. బాధితులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు.

congress leader allegation Injustice to victims because of that aleru mla
ఆ ఎమ్మెల్యే కారణంగానే బాధితులకు అన్యాయం: కాంగ్రెస్​

By

Published : Jan 17, 2021, 3:55 PM IST

యాదగిరిగుట్ట ప్రాంతంలో జరుగుతోన్న రోడ్డు విస్తరణలో ఇళ్లు, షాపులు కోల్పోతున్న బాధితులకు ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత కారణంగానే అన్యాయం జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ ఆలేరు నియోజకవర్గ నాయకుడు బీర్ల అయిలయ్య విమర్శించారు. ఈ మేరకు వైకుంఠ ద్వారం వద్ద రిలే నిరాహారదీక్షలు చేపట్టారు. నష్టపోయిన వారందరికీ న్యాయం చేస్తానని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఐదేళ్లు గడుస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో ఎమ్మెల్యే సునీత బాధ్యత తీసుకుని నిర్వాసితులకు న్యాయం జరిగేలా చూడాలని కోరారు.

రాష్ట్రంలో పరిపాలన పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందని బీర్ల అయిలయ్య విమర్శించారు. తెలంగాణాలో కొన్ని ప్రాంతాలనే అభివృద్ధి చేస్తోన్న ప్రభుత్వం మిగతా ప్రాంతాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్​ ఇచ్చిన మాట ప్రకారం నిర్వాసితులకు న్యాయం చేసే వరకు కాంగ్రెస్​ పార్టీ తరపున పోరాటం చేస్తామని ఆయన తెలిపారు.

ఇదీ చదవండి:కరోనా వ్యాక్సినేషన్‌పై సైకత శిల్పం రూపకల్పన

ABOUT THE AUTHOR

...view details