జనగామ జిల్లా కేంద్రంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ముస్లింలకు విందు ఇవ్వడం అంటే అన్ని కులాలను, మతాలను ఐక్యం చేయడమేనని టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. వెనుకబడిన ముస్లింలకు 4శాతం రిజర్వేషన్ కల్పించి లక్షలాది పేద ముస్లింలకు కాంగ్రెస్ న్యాయం చేసిందని గుర్తు చేశారు.
'కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు' - PONNALA LAXMAIH
డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి నేతృత్వంలో ముస్లిం సోదరులకు జనగామ జిల్లా కేంద్రంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

'కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు'
'కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు'
ముస్లిం సోదరులపై దాడులు జరిగిన అంబర్ పేటలో మజీద్‌ను కూల్చేసినా తెరాస కనీసం స్పందించలేదని ఎద్దేవా చేశారు. జనగామ డీసీసీ అధ్యక్షుడు జంగా రాఘవరెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో కలిసి ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇవీ చూడండి: కబ్జాకోరుల నుంచి చెరువును కాపాడండి
Last Updated : May 31, 2019, 9:11 AM IST