కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ విధానంతో మధ్య తరగతి రైతులు నష్టపోతారని... కేవలం ఉన్నత వర్గాలకు చెందిన వ్యాపారులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందని వామపక్షాల నాయకులు ఆరోపించారు. రైతు విద్రోహకర వ్యవసాయ సంస్కరణల బిల్లులని తిప్పికొట్టాలని కోరారు. వ్యవసాయాన్ని పెద్ద కంపెనీల నుంచి కాపాడాలని కోరుతూ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ మండల కేంద్రంలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
వ్యవసాయాన్ని రక్షించడం మన బాధ్యత
ప్రపంచంలో ఏ దేశంలోనూ ప్రభుత్వ మద్దతు లేకుండా వ్యవసాయ రంగం బతికే పరిస్థితి లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నూతనంగా ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగాన్ని రక్షించడం దేశ ప్రజలందరి బాధ్యత అని గుర్తు చేశారు. కార్పొరేటర్ల నుంచి రైతులని కాపాడుకోవాలని... రైతులు పండించిన పంటలకు మద్దతు ధర హామీని కల్పిస్తూ చట్టం చేయాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ధర్నా