జనగామ జిల్లా వ్యాప్తంగా ప్రతి శనివారం నిర్వహిస్తున్న పల్లె నిద్ర కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లా లింగాల ఘన్పూర్లో జిల్లా పాలనాధికారి నిఖిల బస చేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను అడిగి పలు సమస్యల వివరాలు తెలుసుకున్నారు.
లింగాల ఘన్పూర్లో బస చేసిన కలెక్టర్ నిఖిల - latest news on collector nikhitha participated inpalle nidra
పల్లెనిద్రలో భాగంగా జనగామ జిల్లా లింగాల ఘన్పూర్లో జిల్లా కలెక్టర్ నిఖిల బసచేశారు. స్థానిక ప్రజాప్రతినిధులకు పలు సూచనలు చేశారు.
పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా జనగామ జిల్లాలో ప్రతి శనివారం పల్లెనిద్ర కార్యక్రమం చేపట్టామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా పల్లెప్రగతిలో చివరి స్థానంలో నిలిచిన గ్రామాల్లో పర్యటించి.. ఆ గ్రామాలను ముందుకు తీసుకువెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామాల్లో హరితహారం, ఇంకుడు గుంతల నిర్మాణం, డంపింగ్ యార్డు, శ్మశాన వాటికల నిర్మాణం, పారిశుద్ధ్యం సక్రమంగా అమలు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు.
ఇదీ చూడండి:విద్వేషపూరిత సందేశాలను అరికట్టేందుకు వాట్సప్ నంబర్!