కార్తిక పౌర్ణమిని పురస్కరించుకొని జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలోని బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో సామూహిక సత్యనారాయణ వ్రతాలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున హాజరై సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొన్నారు. దేవాలయంలో అర్చకులు స్వామివారికి మేలుకొలుపు, సుప్రభాత సేవ, అర్చన, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సత్యనారాయణ స్వామి పీఠం వద్ద సామూహిక సత్యనారాయణ వ్రతాలు చేపట్టారు.
చిల్పూర్లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు - జనగామ తాజా అప్డేట్స్
కార్తిక పౌర్ణమి సందర్భంగా చిల్పూర్ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు. ఆలయంలో ఏర్పాటు చేసిన సామూహిక సత్యనారాయణ వ్రతాల్లో పాల్గొన్నారు. అనంతరం కార్తిక దీపాలు వెలిగించారు.
చిల్పూర్లో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
దేవాలయంలోని ధ్వజస్తంభం వద్ద మహిళలు కార్తిక దీపాలు వెలిగించి... మొక్కులు తీర్చుకున్నారు. వేకువ జాము నుంచే ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న తెలిపారు.
ఇదీ చదవండి:రాజన్న ఆలయంలో భక్తుల సందడి