తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR JANGAON TOUR: నేడు జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటన - జనగామ జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన

cm kcr Jangaon district tour: జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. సమీకృత జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం సహా తెరాస కార్యాలయాన్ని సీఎం ఇవాళ ప్రారభించనున్నారు. ఇప్పటికే పట్టణమంతా గులాబీమయం కాగా... కేసీఆర్‌ సభ కోసం తెరాస నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం రాకతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

CM KCR JANGAON TOUR
CM KCR JANGAON TOUR

By

Published : Feb 11, 2022, 2:47 AM IST

cm kcr visits Jangaon district: జనగామ జిల్లాలో నేడు ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటించనున్నారు. ప్రజలకు సౌకర్యవంతమైన సేవలందించేందుకు ఒకేచోట ఏర్పాటు చేసిన సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని సీఎం ప్రారంభిస్తారు. సూర్యాపేట రోడ్డులో మూడేళ్ల క్రితం ఈ భవనానికి శంకుస్ధాపన చేయగా...అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 25 ఎకరాల్లో మూడంతస్తుల్లో...32 కోట్ల వ్యయంతో...34 శాఖలు కొలువుతీరే విధంగా...కొత్త కలెక్టరేట్‌ను నిర్మించారు. సీఎం కేసీఆర్‌ రాకతో... మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌లు ఏర్పాట్లను పరిశీలించారు.

గులాబీమయం..

ఉదయం 11 గంటలకు జనగామ చేరుకోనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌.. నూతన కలెక్టరేట్‌ను ప్రారంభించనున్నారు. అనంతరం 2 గంటలకు యశ్వంతాపూర్‌ వద్ద నిర్మించిన జిల్లా పార్టీ నూతన కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. జిల్లా పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవ్వనున్న సీఎం... తర్వాత బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సభ కోసం తెరాస శ్రేణులు భారీగా జనసమీకరణ చేశారు. సుమారు లక్షా 30 వేల మంది సభకు హాజరు కానున్నారు. ముఖ్యమంత్రి రాకతో జనగామ పట్టణ పరిసరాలు పూర్తిగా గులాబీమయమయ్యాయి. కేసీఆర్‌కు స్వాగతం పలుకుతూ.... పార్టీ జెండాలు, ఫ్లెక్సీలు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు.

ప్రజల్లో ఉత్కంఠ..

ఇటీవల కొత్త రాజ్యాంగం అవసరమంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలపై భాజపా నిరసనలు చేపట్టింది. అనంతరం రాష్ట్ర విభజనపై రాజ్యసభలో ప్రధాని వ్యాఖ్యలు దుమారం రేపగా... రాష్ట్రవ్యాప్తంగా తెరాస శ్రేణలు ఆందోళన చేశాయి. ఈ క్రమంలో బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగం ప్రాధాన్యత సంతరించుకుంది. సభలో సీఎం ఏ విధంగా స్పందిస్తారోననే ఉత్కంఠ ప్రజల్లో నెలకొంది.

ఇదీ చూడండి:Medaram Invitation Card: మేడారం జాతర ప్రత్యేకతను తెలిపేలా ఆహ్వన పత్రిక

ABOUT THE AUTHOR

...view details