cm kcr visits Jangaon: జనగామ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటిస్తున్నారు. ప్రజలకు సౌకర్యవంతమైన సేవలందించేందుకు ఒకేచోట ఏర్పాటు చేసిన సమీకృత కలెక్టర్ కార్యాలయ భవన సముదాయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించారు. సూర్యాపేట రోడ్డులో మూడేళ్ల క్రితం ఈ భవనానికి శంకుస్ధాపన చేయగా.. అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా ముస్తాబైంది.
సకల సౌకర్యాలు
జనగామలోని సూర్యాపేట రహదారిలో 25 ఎకరాల్లో 58.20 కోట్ల వ్యయంతో నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. మూడు అంతస్తుల్లో అన్ని హంగులతో విశాలంగా నిర్మించారు. సుమారు 2 లక్షల 17 వేల 468 చదరపు ఫీట్లు గల ఈ సమీకృత కలెక్టర్ కార్యాలయంలో 34 శాఖలు కొలువుదీరనున్నాయి. కార్యాలయంలో కలెక్టర్ ఛాంబర్, ఇద్దరు అదనపు కలెక్టర్ల ఛాంబర్లు, డీఆర్వో ఛాంబర్లు, కలెక్టరేట్ స్టాఫ్ హాల్ , స్టేట్ ఛాంబర్, స్టాఫ్ రూమ్, విశ్రాంతి గది, రెండు వెయిటింగ్ హాళ్లు, 25 మందికి సరిపోయే మినీ కాన్ఫరెన్స్ హాల్, 32 మందికి సరిపోయే కాన్ఫరెన్స్ హాల్, 250 మంది పెట్టె మీటింగ్ హాల్ ఉన్నాయి. 4 లిఫ్ట్లు, అత్యవసర ద్వారాలు, హెలిపాడ్, 200 కార్లు పట్టే విశాలమైన పార్కింగ్ స్థలంతో పాటు మరెన్నో సౌకర్యాలున్నాయి.
గులాబీమయం..