తెలంగాణ

telangana

ETV Bharat / state

CM KCR Election Campaign Today : ప్రచారంలో గులాబీ బాస్ దూకుడు .. ఇవాళ 2 నియోజకవర్గాల్లో పర్యటన - బీఆర్​ఎస్​ ఎన్నికల ప్రచారం

CM KCR Election Campaign Today 2023 : ఎన్నికలప్రచారంలో భాగంగా.. ఇవాళ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జనగామ, భువనగిరి బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. ఆ సభల కోసం గులాబీ శ్రేణులు.. ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు చేశారు. ఒక్కో సభకు దాదాపు లక్ష మందికిపైగా జనసమీకరణ చేసే ప్రయత్నాల్లో నేతలు నిమగ్నమయ్యారు. సీఎం సభల కోసం పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు.

BRS Election  Campaign in Bhuvanagiri
CM KCR Election Campaign in Telangana

By ETV Bharat Telangana Team

Published : Oct 16, 2023, 7:13 AM IST

CM KCR Election Campaign Today ప్రచారంలో దూసుకుపోతున్న గులాబీదళపతి

CM KCR Election Campaign Today 2023: ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR)​ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. అందరికంటే ముందుగా అభ్యర్థులని ప్రకటించి.. భీ ఫారాలు అందించిన గులాబీ దళపతి రోజుకు రెండేసి సభలతో.. నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటన చేయనున్నారు. ఆదివారం హుస్నాబాద్‌లో ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న సీఎం.. ఇవాళ జనగామ, భువనగిరి సభల్లో పాల్గొంటున్నారు. మేనిఫెస్టోలో పేర్కొన్న అంశాలను వివరించడంతో పాటు పదేళ్లలో చేసిన అభివృద్ధి.. బీఆర్​ఎస్(BRS)​ మరోసారి అధికారం చేపట్టాల్సిన ఆవశ్యకతను.. ముఖ్యమంత్రి ఆయా సభల్లో వివరించనున్నారు. ప్రతిపక్షాలు లక్ష్యంగా విమర్శనాస్త్రాలు సంధిస్తారని స్థానిక గులాబీ నేతలు పేర్కొంటున్నారు.

CM KCR Election Campaign Vehicle : ఎన్నికలకు కేసీఆర్ ప్రచారరథం సిద్ధం.. హుస్నాబాద్​లో తొలి శంఖారావం

CM KCR Election Campaign in Jangaon: తొలుత ముఖ్యమంత్రి కేసీఆర్​.. జనగామ వికాస్‌నగర్‌లోని వైద్యకళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ముఖ్యమంత్రితో పాటు జిల్లా మంత్రులు ఇతర నాయకుల కోసం.. భారీ వేదిక సిద్ధం చేశారు. ఇటీవలే కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన మాజీమంత్రి, పీసీసీ పూర్వ అధ్యక్షుడు పొన్నాల లక్ష్యయ్య సీఎంతో కలసి సభలో పాల్గొంటారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో నిర్వ హించే తొలి సభను గులాబీ సేనలు ప్రతిష్ఠాత్మక్మంగా తీసుకొని జనసమీకరణ చేస్తున్నారు. బీఆర్​ఎస్​ అభ్యర్ధి పల్లా రాజేశ్వరరెడ్డి అన్ని మండలాల్లో సన్నాహాక సమావేశాలు నిర్వహించి ప్రజలను రప్పించే ప్రయత్నం చేశారు. ఈసారి వంద సీట్లలో గులాబీ గెలుపు ఖాయమని ధీమాగా చెప్పారు.

KCR Announced Gas Cylinder for 400Rupees : రూ.400కే గ్యాస్‌ సిలిండర్‌.. మేనిఫెస్టోలో ప్రకటించిన కేసీఆర్‌

"బీఆర్​ఎస్​ పార్టీ దేశంలోనే అతి పెద్ద సభలు పెట్టే అనుభవం ఉంది. వరంగల్​ ఉమ్మడి జిల్లాలో జనగామలో సభను నిర్వహించేందుకు అవకాశం ఇచ్చారు. ప్రపంచంలో అతిపెద్ద సభను పెట్టింది కూడా వరంగల్​ ప్రకాశ్​ నగర్​లోనే. సభలకు సంబంధించిన ఏర్పాట్లు చేశాం. ఎటువంటి ఇబ్బంది లేదు. లక్ష మందికి వచ్చిన సరిపోయే విధంగా ఏర్పాట్లు చేశాం. కుర్చీలు అధికంగా ఏర్పాటు చేశాం. రవాణా ఏర్పాటు చేశాం. మూడోసారి 100 సీట్లు కచ్చితంగా వస్తాయి."- పల్లా రాజేశ్వరరెడ్డి, జనగామ బీఆర్​ఎస్​ అభ్యర్ధి


CM KCR Election Campaign in Bhuvanagiri: అనంతరం భువనగిరి(Bhuvanagiri) జూనియర్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొని ప్రసంగిస్తారు. భారీగా జనం తరలివచ్చేలా.. ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి విస్తృత ఏర్పాట్లు చేశారు. బీఆర్​ఎస్​ అభ్యర్థులు.. సీఎం కేసీఆర్‌ సభలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. ఈనెల 26 నుంచి 31 మధ్య.. మునుగోడు, కోదాడ, తుంగతుర్తి, ఆలేరు, హుజూర్‌నగర్‌, మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో జరిగే సభల్లోనూ పాల్గొననున్నారు. నామినేషన్ల తర్వాత సూర్యాపేట, నకిరేకల్‌, నల్గొండ, నాగార్జునసాగర్‌ నియోజకవర్గాల్లో కేసీఆర్‌ సభలు జరుగనున్నాయి. సీఎం పర్యటన దృష్ట్యా.. రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ ఏర్పాట్లు పరిశీలించారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్ఠ చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.

KCR Bheema Scheme in Telangana : 'కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా.. 100 శాతం ప్రీమియం ప్రభుత్వమే చెల్లిస్తుంది'

KCR Speech in Praja Ashirvada Sabha Husnabad : 'ఒక్క ఛాన్స్‌ అంటూ వచ్చే వారిని నమ్మొద్దు.. ఆలోచించి ఓటెయ్యకపోతే ఆగమవుతాం'

ABOUT THE AUTHOR

...view details