జనగామ జిల్లా కేంద్రంలోని ప్రిస్టోన్ కళాశాల ప్రాంగణంలో బుధవారం ధర్నా సినిమా షూటింగ్ నిర్వహించారు. పట్టణంలో సినిమా షూటింగ్ జరుగుతోందని తెలుసుకున్న అభిమానులు కళాశాల మైదానానికి భారీగా తరలివచ్చారు. సినిమాలో నటిస్తున్న నటులతో కలిసి సెల్ఫీలు దిగారు.
జిల్లా కేంద్రంలో సినిమా షూటింగ్ సందడి - telangana news
జనగామ జిల్లా కేంద్రంలో బుధవారం ధర్నా సినిమా షూటింగ్ సందడి జరిగింది. ఈ నేపథ్యంలో అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పలువురు నటినటులతో సెల్ఫీలు దిగారు.
![జిల్లా కేంద్రంలో సినిమా షూటింగ్ సందడి Cinema shooting in the center of the district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5566060-448-5566060-1577932840272.jpg)
జిల్లా కేంద్రంలో సినిమా షూటింగ్ సందడి
సనాతన క్రియేషన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ధర్నా సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం పూర్తైందని సినిమా డైరెక్టర్, నిర్మాత, హిరో కళాదర్ అన్నారు. క్లైమ్యాక్స్ సీన్లను పూర్తి చేసుకోవడానికి జనగామకు వచ్చామని పేర్కొన్నారు. జనగామ ప్రజలు బాగా సహకరించారని, మార్చిలో తమ సినిమా విడుదల చేస్తామని తెలిపారు. ఈ సినిమాను ప్రజలు విజయవంతం చేయాలని కోరారు.
జిల్లా కేంద్రంలో సినిమా షూటింగ్ సందడి
ఇదీ చూడండి : కల్తీ నివారణకు కాసుల కొరత
TAGGED:
_movie_shooting_sandadi