తెలంగాణ

telangana

ETV Bharat / state

కన్నుల పండువగా వెంకటేశ్వర స్వామి కల్యాణ వేడుక - Chilpur Venkateshwara swamy

జనగామ జిల్లా చిల్పూర్​లోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కల్యాణ వేడుకను కన్నుల పండువగా నిర్వహించారు. ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.

Chilpur Venkateshwara swamy kalyanam
కన్నుల పండువగా వెంకటేశ్వర స్వామి కల్యాణ వేడుక

By

Published : Sep 27, 2020, 8:47 PM IST

జనగామ జిల్లా స్టేషన్ ఘన్​పూర్ నియోజకవర్గం చిల్పూర్ మండల కేంద్రంలోని బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామి వారి కల్యాణ వేడుక కన్నుల పండువగా జరిగింది. వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణా నక్షత్రం సందర్భంగా ఆలయంలో ప్రాతః కాలమే స్వామి వారికి మేలుకొలుపు సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం అభిషేకాలు జరిపి.. అష్టోత్తర శతనామావళి పఠించారు.

అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై స్వామి వారిని ప్రతిష్టించి మేళతాళాలు, మంత్రోచ్ఛారణల మధ్య కల్యాణం నిర్వహించారు. ఆలయ ఈవో లక్ష్మీ ప్రసన్న కరోనా నిబంధనలు పాటిస్తూ కల్యాణంలో పాల్గొని స్వామి వారికి పూజలు చేశారు.

ఇదీచూడండి: రెవెన్యూ సమస్యలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం: హరీశ్

ABOUT THE AUTHOR

...view details