తెలంగాణ

telangana

By

Published : May 30, 2020, 12:31 PM IST

ETV Bharat / state

బ్రిడ్జి నిర్మాణం డిజైన్ మార్పు కోసం అఖిలపక్ష నేతల ధర్నా

స్టేషన్ ఘనపూర్ లో బ్రిడ్జి నిర్మాణ డిజైన్ మార్చాలంటూ అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే రాజయ్య ఇతర ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి వ్యాపార వాణిజ్య రంగాలకు నష్టం కలగకుండా చూడాలని కోరారు. డిజైన్ మార్చకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Station on Ghanpur on the road
బ్రిడ్జి నిర్మాణం డిజైన్ మార్పు కోసం అఖిలపక్ష నేతల ధర్నా

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ జాతీయ రహదారిపై నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ డిజైన్ మార్చాలంటూ అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. బ్రిడ్జి నిర్మాణ స్థలాన్ని పరిశీలించి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఎమ్మెల్యే రాజయ్య ఇతర ప్రజాప్రతినిధులు వెంటనే స్పందించి వ్యాపార వాణిజ్య రంగాలకు నష్టం కలగకుండా చూడాలని కోరారు.

బ్రిడ్జి నిర్మాణం గోడతో కాకుండా.. పిల్లర్ల సాయంతో నిర్మించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం ఉన్న డిజైన్ వల్ల స్థానిక గ్రామాల ప్రజలు, చిరు వ్యాపారులకు తీవ్ర ఇబ్బందులు వస్తాయని పేర్కొన్నారు. డిజైన్ మార్చకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని అఖిలపక్ష నేతలు హెచ్చరించారు. ఇప్పటికైనా ప్రభుత్వం ప్రజా ప్రతినిధులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

ఇదీ చూడండి:ఒకే ఇంట్లో నలుగురికి కరోనా

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details