సాధారణ పౌరులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చలాన్లు విధించడం, చర్యలు తీసుకోవడం పరిపాటే. కానీ సాక్షాత్తు కలెక్టర్ వాహనమే నిబంధనలకు విరుద్ధంగా అతివేగంగా నడిపితే.. ఏం చేస్తారు. వారికి కూడా ఇవే రూల్స్ వర్తిస్తాయా?
Challan: జనగామ కలెక్టర్ వాహనానికి 23 చలాన్లు.. రూ.23 వేల జరిమానా! - jangaon district collector
వాహనం వేగంగా నడిపినా.. ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోయినా సాధారణంగా చలాన్లు విధిస్తారు. సాధారణ పౌరులు నిబంధనలు ఉల్లంఘిస్తే చలాన్లు విధించడం పరిపాటే. కానీ ఓ అధికారి వాహనమే రూల్స్ పాటించకపోతే ఏం చేస్తారు? తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..
వర్తిస్తాయనే అనిపిస్తోంది తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న ఓ పోస్ట్ చూస్తుంటే. ఇంతకీ అందేంటంటే.. అతి వేగంగా ప్రయాణించినందుకు జనగామ జిల్లా కలెక్టర్ వాహనం(టీఎస్27ఎ0001)పై గతేడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది ఆగస్టు 30 వరకు 23 చలాన్లు నమోదయ్యాయి. ఇందుకుగాను రూ.22,905 చెల్లించాల్సి ఉన్నట్లుగా తెలంగాణ స్టేట్ పోలీస్ ఇంటిగ్రేటెడ్ ఇ-చలాన్ సిస్టం’ వెబ్‌సైట్‌లో పలువురు తనిఖీ చేయగా తేలింది. ఈ విషయం సోమవారం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారం కావడంతో జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.