తెలంగాణ

telangana

ETV Bharat / state

జనగామ జిల్లాలో ఇంటింటికి వెళ్లి నమూనాలు సేకరణ

జనగామ జిల్లాలో ఇంటింటికి వెళ్లి నమూనాలు సేకరణ
జనగామ జిల్లాలో ఇంటింటికి వెళ్లి నమూనాలు సేకరణ

By

Published : May 15, 2020, 1:24 PM IST

Updated : May 15, 2020, 1:59 PM IST

13:20 May 15

జనగామ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన

జనగామ జిల్లాలో ఇంటింటికి వెళ్లి నమూనాలు సేకరణ

కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం ప్రయోగాత్మక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఐసీఎంఆర్​ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వైద్య బృందాలు.. గ్రీన్‌, ఆరెంజ్‌ జోన్లలో సిరో ప్రొవిలెన్స్‌ సర్వే చేపట్టాయి. తొలివిడతలో రాష్ట్రంలోని నల్గొండ, కామారెడ్డి, జనగామ జిల్లాల్లో.. ర్యాండమ్‌ పద్ధతిలో ఇంటింటి సర్వే నిర్వహించి ప్రజల నుంచి రక్త నమూనాలు సేకరిస్తున్నారు.  

 సర్వే కోసం జిల్లాకు 5 బృందాల చొప్పున మొత్తం  15 బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఒక్కో జిల్లా నుంచి 400 నమూనాలు సేకరించి వైద్య పరీక్షలకు పంపనున్నారు. మొదటగా జనగామ జిల్లాలోని జనగామ, దేవరుప్పల, లింగాల గణపురం, బచ్చన్నపేట, నర్మెట్ట గ్రామాల్లో నమూనాలు సేకరిస్తున్నారు.  ఈ సర్వే ద్వారా క్షేత్రస్థాయిలో కరోనా ప్రభావాన్ని అంచనా వేసి తదుపరి చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం.. మరిన్ని వ్యూహాలు రూపొందించే అవకాశముంది.

Last Updated : May 15, 2020, 1:59 PM IST

ABOUT THE AUTHOR

...view details