జనగామ జిల్లా దేవురుప్పుల మండలం బంజారా వద్ద సిద్దిపేట-సూర్యాపేట జాతీయ రహదారిపై ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం జనగామ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి - జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి
సిద్దిపేట-సూర్యాపేట జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న రెండు కార్లు ఢీకొని ముగ్గురు మృతి చెందారు.
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురు మృతి
మృతులు జనగామకు చెందిన సోమనర్సయ్య, డ్రైవర్ మణిదీప్, దేవురుప్పుల మండలం పెద్దమాడుర్కి చెందిన కొమ్ము కృష్ణగా గుర్తించారు.
ఇవీ చూడండి: ఈఎస్ఐ నిందితుల కస్టడీ పిటిషన్పై రేపు అనిశా కోర్టు తీర్పు
Last Updated : Oct 4, 2019, 3:30 PM IST