తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించాలి' - Build a plastic free society in Janagama district

ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పాటుపడాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సూచించారు. జనగామ జిల్లాను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కోరారు.

'ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించాలి'

By

Published : Nov 6, 2019, 4:49 PM IST

జనగామ జిల్లా కేంద్రంలో ముత్తిరెడ్డి సేవ సంస్థ ఆధ్వర్యంలో ప్లాస్టిక్ నివారణ ర్యాలీ చేపట్టారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి ప్రధాన చౌరస్తా వరకు కళాశాల, పాఠశాల విద్యార్థులచే భారీ ర్యాలీ నిర్వహించారు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్ధాల గురించి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వివరించారు. ప్లాస్టిక్ వాడకం వల్ల పర్యవరణమే, కాకుండా ప్రజల ఆరోగ్యాలు దెబ్బతింటాయని... ప్లాస్టిక్ రహిత జిల్లాగా జనగామను తీర్చిదిద్దాలని కోరారు. ప్రతి ఒక్కరూ జూట్ బ్యాగ్​లను వాడాలని విజ్ఞప్తి చేశారు.

'ప్లాస్టిక్ రహిత సమాజం నిర్మించాలి'

ABOUT THE AUTHOR

...view details