BRS ZP Chairman Dies of Heart Attack : జనగామ జిల్లా జడ్పీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాగాల సంపత్ రెడ్డి గుండెపోటుతో మృతి చెందారు. సాయంత్రం సమయంలో ఒక్కసారిగా నొప్పితో తీవ్ర అస్వస్థతకు గురైన సంపత్ రెడ్డిని, హుటా హుటిన వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స కోసం నిమిత్తం తరలించారు. అయినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ తరలించిన కొద్ది సేపటికే ఆయన మరణించారు.
గుండెపోటుతో బీఆర్ఎస్ జడ్పీ ఛైర్మన్ మృతి - కేసీఆర్ సంతాపం - జనగామ నేర వార్తలు
BRS ZP Chairman Dies of Heart Attack : జనగామ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, జిల్లా పరిషత్ ఛైర్మన్ పాగాల సంపత్ రెడ్డి గుండె పోటుతో మరణించారు. అస్వస్థతకు గురైన వెంటనే కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. హనుమకొండలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. తరలించిన కొద్దిసేపటికే ఆయన మృతి చెందారు. ఆయన మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం తెలియజేశారు.

Published : Dec 4, 2023, 8:35 PM IST
|Updated : Dec 4, 2023, 8:54 PM IST
సంపత్ రెడ్డికి భార్యా, ఓ కుమార్తె ఉన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి కాలేదని సంపత్ రెడ్డి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు కార్యకర్తలు తెలిపారు. సంపత్ రెడ్డి చేసిన సేవలను అధిష్ఠానం గుర్తించి, ముందుగా 2019లో జడ్పీ ఛైర్మన్‌గా, ఆ తరువాత జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. సంపత్ మృతితో జనగామ జిల్లా చిల్పూర్ మండలం రాజవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంపత్ రెడ్డి మృతిపట్ల ప్రగాఢ సంతాపం తెలియజేశారు. ఉద్యమం నుంచి తన వెంట నడిచిన సంపత్ ఇలా అకాల మరణం చెందడం బాధాకరంగా ఉందని అన్నారు. ఆయన కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. స్టేషన్‌ఘన్‌పూర్ కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో కడియం శ్రీహరితో కలిసి ఇవాళ సాయంత్రం మీడియా సమావేశంలో కూడా సంపత్ పాల్గొన్నారు. అంతలోనే ఈ దుర్ఘటన జరగటం పట్ల కార్యకర్తలు వాపోయారు.