BRS MLA Ticket Fight in Jangaon :బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఖరారు కొలిక్కి వచ్చిన దశలో.. జనగామ రాజకీయం రోజురోజుకు వేడెక్కుతోంది. సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డితో పాటు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి జనగామ టికెట్‌ను ఆశిస్తున్నారు. కొంతకాలంగా అంతర్గతంగా ఉన్న నేతల మధ్య పోటీ.. బహిరంగమయ్యాయి. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి బలప్రదర్శనకు దిగుతున్నారు.
MLA Ticket Fight Between Muthireddy vs Pochampally :బుధవారం ప్రగతి భవన్ పక్కనే ఉన్న హరిత ప్లాజా హోటల్‌లో జనగామ, చేర్యాలకు చెందిన బీఆర్‌ఎస్ నేతలు, పలువురు స్థానిక సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు. బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, జనగామ మున్సిపల్ ఛైర్ పర్సన్, ఎంపీటీసీలు, తదితర నేతలు ఉన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డికిమద్దతుగా వారందరూ.. బీఆర్‌ఎస్ పెద్దలను కలిసేందుకే వారందరూ అక్కడ కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. ముత్తిరెడ్డి యాదగిరి(MLA Muthireddy Yadagiri Reddy) హోటల్‌కు వెళ్లి ఇలా సమావేశం కావడం సరైన పద్ధతి కాదనడంతో కొంత వాగ్వాదం జరిగింది.
''నేతలను బలపరచడానికి అయితే అందరి ముందు వారిని కలుస్తా.. కానీ నాకు పని ఉంది నేను ఎల్లుండి వస్తాను అంటే మా కార్యకర్తలు జరుగుతున్న పరిణామాలకు కలత చెందారు అందుకే వారిని కలవడానికి వచ్చాను. జరుగుతున్న పరిణామాలు మా పార్టీకి విరుద్ధం. ముఖ్యమంత్రి లక్ష్యానికి విరుద్ధం. సీఎంకు ఇలాంటి గ్యాబ్లింగ్‌లు తెలియదు. ఏదైనా పోరాడి గెలుచుకుంటారు. నాకు పల్లా రాజేశ్వర్ రెడ్డికి ఎలాంటి గొడవలు లేవు. అలాంటివి ఏవైనా ఉంటే ముఖ్యమంత్రిగారు తెలుసుకుంటారు. సరిదిద్దుతారు. రాష్ట్రంలో జరుగుతున్న కుట్రల్నే ఆయన సరిదిద్దారు ఇలాంటివి ఆయనకు ఎంత.''- ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జనగామ ఎమ్మెల్యే
'MLA Muthireddy and his Daughter Controversy : 'నా తండ్రికి రూ.వేల కోట్ల ఆస్తులున్నాయ్.. ఇలా చేయడం తప్పు'