జనగామ జిల్లా కేంద్రంలోని ధర్మశాలలో వాసవి ఆర్యవైశ్య మహిళ మహాసభ ఆధ్వర్యంలో... బతుకమ్మ పండుగకు ముందస్తుగా జరుపుకునే బొడ్డెమ్మ వేడుక నిర్వహించారు. పూలతో బతుకమ్మలు పేర్చి మహిళలు, చిన్నారులు ఆడి పాడారు. ఇప్పటి పిల్లలకు బతుకమ్మ మాత్రమే తెలుసునని, ముందస్తుగా ఆడే బొడ్డెమ్మ పండుగను మర్చిపోతున్నారని.. వారికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ కార్యక్రమం నిర్వహించినట్లు సంస్థ అధ్యక్షురాలు నాగమణి తెలిపారు.
జనగామలో వైభవంగా బొడ్డెమ్మ వేడుకలు - boddemma celebrations
బతుకమ్మ పండుగకు ముందు ఆడే బొడ్డెమ్మ వేడుక... జనగామలో వాసవి ఆర్యవైశ్య మహిళ మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ తరం పిల్లలకు బొడ్డెమ్మ ప్రాధాన్యతను తెలిపేందుకే నిర్వహించినట్లు నిర్వాహకులు తెలిపారు.

జనగామలో వైభవంగా బొడ్డెమ్మ వేడుకలు