రక్తదానం ప్రాణదానంతో సమానమని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ సీఐ శ్రీనివాస రెడ్డి అన్నారు. మండల కేంద్రంలో తలసేమియా వ్యాధి బాధితుల సహాయార్థం పోలీసులు, రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. పలు గ్రామాల నుంచి పెద్ద ఎత్తున యువతతో పాటు పోలీసులు రక్తదానం చేశారు. రక్తదాతలకు సీఐ ధ్రువీకరణ పత్రాలు అందజేసి ప్రశంసించారు.
రక్తదానం ప్రాణదానంతో సమానం - janagama district latest news
రక్తదానం ప్రాణదానంతో సమానమని జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ సీఐ శ్రీనివాస రెడ్డి అన్నారు. ప్రస్తుతం తలసేమియాతో బాధపడుతున్న ఎంతోమందికి రక్తం అందక ఇబ్బందులు పడుతున్నారని... వారి సహాయార్థం రక్తదానం చేసినట్లు తెలిపారు.
స్టేషన్ ఘన్‌పూర్‌లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు
రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో ఎంతోమంది... సకాలంలో వారికి కావలసిన రక్తం లభించక మరణిస్తున్నారని సీఐ పేర్కొన్నారు. అలాంటివారిని ఆదుకోవడానికి యువత ముందుకు వచ్చి రక్తం ఇవ్వడం అభినందనీయమన్నారు. ప్రస్తుతం తలసేమియాతో బాధపడుతున్న ఎంతోమందికి రక్తం అందక ఇబ్బందులు పడుతున్నారని... వారి కోసం రక్తదానం చేసినట్లు తెలిపారు.
ఇదీ చదవండి: ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో రుణమాఫీ : హరీశ్‌రావు