రాష్ట్ర యువజన మోర్చా పిలుపు మేరకు జనగామలో బీజేవైఎం కాగడాల ప్రదర్శన నిర్వహించింది. జిల్లా కేంద్రంలోని చౌరస్తా నుంచి రైల్వేస్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారకంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.
జనగామలో బైజేవైఎం కాగడాల ప్రదర్శన - జనగామ తాజా వార్తలు
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని బీజేవైఎం డిమాండ్ చేసింది. జనగామ జిల్లా కేంద్రంలో కాగడల ప్రదర్శన నిర్వహించారు.

జనగామలో బీజేవైఎం కాగడాల ప్రదర్శన
తెలంగాణ ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్... అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ అంశాన్ని విస్మరించారని ఆరోపించారు. తమ డిమాండ్‌కు ప్రభుత్వం అంగీకరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని బీజేవైఎం కార్యకర్తలు హెచ్చరించారు.
ఇదీ చూడండి:తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ర్యాలీ