తెలంగాణ

telangana

ETV Bharat / state

మరోసారి కరెంట్ ఛార్జీలు పెంచేందుకు కేసీఆర్​ కుట్ర చేస్తున్నారన్న బండి సంజయ్ - bandi sanjay praja sangrama yathra

bandi sanjay comments on cm kcr రాష్ట్రంలో మరోసారి విద్యుత్​ ఛార్జీలు పెంచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజలపై మరో రూ.4 వేల కోట్ల భారం మోపేందుకు కుట్ర చేస్తున్నారని ఆక్షేపించారు. అందుకే కేంద్రం ఎక్స్ఛేంజీలో విద్యుత్​ విక్రయాలు ఆపేసిందని పేర్కొన్నారు. జనగామ జిల్లా ఖిలాషపూర్​లో ప్రజా సంగ్రామ యాత్రలో ఆయన ఈ మేరకు మాట్లాడారు.

మరోసారి కరెంట్ ఛార్జీలు పెంచేందుకు కేసీఆర్​ కుట్ర చేస్తున్నారన్న బండి సంజయ్
మరోసారి కరెంట్ ఛార్జీలు పెంచేందుకు కేసీఆర్​ కుట్ర చేస్తున్నారన్న బండి సంజయ్

By

Published : Aug 20, 2022, 12:32 PM IST

Updated : Aug 20, 2022, 12:55 PM IST

మరోసారి కరెంట్ ఛార్జీలు పెంచేందుకు కేసీఆర్​ కుట్ర చేస్తున్నారన్న బండి సంజయ్

bandi sanjay comments on cm kcr: రాష్ట్రంలో మరోసారి కరెంట్ ఛార్జీలు పెంచి ప్రజలపై మరో రూ.4 వేల కోట్ల భారాన్ని మోపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. కేసీఆర్ తీరు వల్ల విద్యుత్ సంస్థలకు రూ.60 వేల కోట్ల బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. తద్వారా కరెంట్ ఉత్పత్తి సంస్థలన్నీ మూతపడే దుస్థితి ఏర్పడిందని ఆక్షేపించారు. ఇదే పరిస్థితి కొనసాగితే.. రాష్ట్రమంతా చీకట్లు అలుముకునే ప్రమాదం ఉందన్నారు. ఈ దుస్థితి నుంచి బయటపడేసేందుకే కేంద్ర ప్రభుత్వం పవర్ ఎక్స్ఛేంజీల వద్ద విద్యుత్ కొనడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుందని స్పష్టం చేశారు. జనగామ జిల్లా ఖిలాషపూర్ సమీపంలోని పాదయాత్ర శిబిరం వద్ద బండి సంజయ్ మాట్లాడారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్​కు నిజంగా దమ్ముంటే.. డిస్కంలతో పాటు సింగరేణి, ఎన్టీపీసీ సంస్థలకు ఎన్నెన్ని బకాయిలున్నాయనే అంశంపై తక్షణమే శ్వేతపత్రం విడుదల చేయాలని బండి సంజయ్​ డిమాండ్ చేశారు. కేసీఆర్​ది ఒకటే ఆలోచన అని.. ఈ రాద్ధాంతం చేసి మళ్లీ కరెంట్ ఛార్జీలు పెంచే కుట్రకు సిద్ధమయ్యాడని విమర్శించారు.

రాష్ట్రంలో మరోసారి కరెంట్ ఛార్జీలు పెంచేందుకు కేసీఆర్ కుట్ర చేస్తున్నారు. ప్రజలపై మరో రూ.4 వేల కోట్ల భారం మోపేందుకు ప్రయత్నిస్తున్నారు. కేసీఆర్ తీరు వల్ల కరెంట్ ఉత్పత్తి సంస్థలన్నీ మూతపడే దుస్థితి ఏర్పడింది. ఇదే పరిస్థితి కొనసాగితే.. రాష్ట్రమంతా చీకట్లు అలుముకునే ప్రమాదం ఉంది. ఈ దుస్థితి నుంచి బయట పడేసేందుకే కేంద్ర ప్రభుత్వం పవర్ ఎక్స్ఛేంజీల వద్ద విద్యుత్ కొనడాన్ని నిషేధిస్తూ నిర్ణయం తీసుకుంది. రేపు జరగబోయే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభను దిగ్విజయవంతం చేయాలి. ఈసారి మునుగోడు ప్రజలంతా భాజపావైపే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ మునుగోడు ప్రజలకు పొర్లు దండాలు పెట్టినా ఎవరూ ఓటెయరు. - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు

ఈ క్రమంలోనే మునుగోడులో రేపు జరగబోయే కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభను దిగ్విజయవంతం చేయాలని బండి సంజయ్​ ప్రజలను కోరారు. కాంగ్రెస్ పార్టీ మునుగోడు ప్రజలకు పాదాభివందనమే కాదు.. పొర్లు దండాలు పెట్టినా ఎవరూ ఓటెయరని మండిపడ్డారు. ఈసారి మునుగోడు ప్రజలంతా భాజపావైపే ఉన్నారని ధీమా వ్యక్తం చేశారు.

ఇవీ చూడండి..

Last Updated : Aug 20, 2022, 12:55 PM IST

ABOUT THE AUTHOR

...view details