Bhoodan Movement Lands: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం... మేకలగట్టు గ్రామ పంచాయతీ పరిధిలోని 206 సర్వే నెంబరులోని 120 ఎకరాల భూమి ఇది. భూదానోద్యమ సమయంలో ఆచార్య వినోభా బావేకు నెల్లుట్ల కేశవరావు అనే భూస్వామి ఈ భూములను దానంగా ఇచ్చారు. 1975లో ప్రభుత్వం వీటిని భూముల్లేని 44 మంది దళితులకు అప్పగించింది. అంతేకాదు..ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భూదాన యజ్ఞ బోర్డు హక్కు పత్రాలను కూడా అందజేసింది. అయితే ఇదంతా గుట్ట ప్రాంతం. సాగు కాస్త కష్టమే. దీంతో లబ్ధిదారులు సాగు చేయలేదు.
నక్సల్స్ పేల్చేయడంతో..
1991 సంవత్సరంలో.. రఘునాథపల్లి రెవెన్యూ కార్యాలయాన్ని నక్సల్స్ పేల్చేయడంతో ఈ భూములకు సంబంధించిన రికార్డులు కూడా కాలిపోయాయి. రికార్డులు కాలిపోవడంతో.. భూములకు సరైన హక్కుదార్లు ఎవరనే దానిపై వివాదం నెలకొంది. కొంతమంది భూమి లబ్ధిదారులు తమ భూములు తమకు కేటాయించాలని... గత సంవత్సరం రెవెన్యూ అధికారులను కోరగా.. వారు.. భూదాన యజ్ఞ బోర్డుకు లేఖ రాశారు. లబ్ధిదారులు సైతం హైదరాబాద్‌లోని భూదాన యజ్ఞం బోర్డు కార్యాలయానికి వెళ్లి.. తమకు కేటాయించిన భూములకు పట్టాలు చేసివ్వాలని కోరారు. కానీ భూదాన బోర్డు నుంచి ఇంతవరకూ ఎలాంటి సమాధానం రాలేదు. ఇక్కడ భూమి ధరలు... గత కొంతకాలంగా విపరీతంగా పెరిగాయి. ఎకరానికి 30 లక్షలకు పైగా ప్రస్తుతం పలుకుతోంది. భూమి ఖాళీగా ఉండడంతో రియల్ మాఫియా ఈ భూములపై కన్నేసింది. ప్రభుత్వ రికార్డులో అసైన్డ్ భూమిగా ఉన్న 206 సర్వే నెంబర్లో వెంచర్లు చేయడం ప్రారంభించారు. గతంలో ఉపాధి హామీ కింద పెంచిన మొక్కలను పీకేసి, కుంటలను పూడ్చేసి గుట్టల ప్రాంతాన్ని చదును చేసి ప్లాటుగా మారుస్తున్నారు.
ఎవరికి మొరపెట్టుకున్నా..