తెలంగాణ

telangana

By

Published : May 28, 2020, 11:12 AM IST

ETV Bharat / state

'నియంత్రిత సాగు విధానంతో నూతన ఒరవడి'

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలాల్లో నియంత్రిత పంటల సాగు విధానం పై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పంటల మార్పిడి వల్ల సాగుభూమి సారవంతం అవుతుందని ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. నియంత్రిత పద్ధతిలో పంటల సాగు చేపట్టి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవడం మన చేతుల్లోనే ఉందని పేర్కొన్నారు.

Awareness Program for Farmers on Controlled Cultivation in Dharmasagar Zones
నియంత్రిత సాగు విధానంతో నూతన ఒరవడి

వ్యవసాయ రంగంలో పంటల మార్పుతో రైతుల జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా.. తెరాస ప్రభుత్వం పని చేస్తోందని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని ధర్మసాగర్ మండలాల్లో నిర్వహించిన నియంత్రిత పంటల సాగు విధానం పై రైతులకు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. పంట మార్పిడి వల్ల సాగుభూమి సారవంతం అవుతుందని స్పష్టం చేశారు.

లాభసాటి పంటలు పండించాలి

నియంత్రిత పద్ధతిలో పంట సాగు చేపట్టి వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవడం మన చేతుల్లోనే ఉందని రాజయ్య పేర్కొన్నారు. రైతులు మూస పద్ధతి వదిలి నూతన వ్యవసాయ విధానాలు అలవాటు చేసుకుని లాభసాటి పంటలు పండించాలని కోరారు. ప్రభుత్వం చెప్పిన పంటలను సాగు చేయాలని సాగు వివరాలను అధికారుల వద్ద నమోదు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. దీనిద్వారా రైతుబంధు, రైతుబీమా ప్రభుత్వ పథకాలకు రైతులు అర్హులు అవుతారని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:మే 31 లోపు ఆస్తిపన్ను చెల్లిస్తే రాయితీ

ABOUT THE AUTHOR

...view details