ఓటు ద్వారా నేతల తలరాతలే కాదు..మన భవిష్యత్తునూ మార్చుకోవచ్చు. బంగారుమయం చేసుకోవచ్చు. మనకు నచ్చిన ప్రజాప్రతినిధిని మనమే ఎన్నుకునే....గొప్ప అవకాశం రాజ్యాంగం మనకు కల్పించింది. అయినా కొంతమందికి ఓటు విలువ తెలియట్లేదంటున్నారు....జనగామ కళాకారులు.
నవ సమాజ నిర్మాణానికి ఓటే ఆయుధం - Awareness on vote while singing
ప్రజాస్వామ్యంలో ఓటు హక్కును సక్రమంగా ఉపయోగిస్తే మనకు కావాల్సిన అభివృద్ధి సాధించుకోవచ్చని జనగామ జిల్లాకు చెందిన కొందరు కళాకారులు పేర్కొన్నారు. ప్రజాస్వామ్య భారతం పౌరులకు కల్పించిన గొప్ప హక్కుగా కొనియడారు. ఓటు వేయకుంటే ప్రశ్నించే అర్హతను కోల్పోతారన్నారు. నవ సమాజ నిర్మాణం కోసం యువత ఓటు అనే ఆయుధాన్ని తీసుకుని ముందుకు రావాలని పాటల ద్వారా వివరించారు.

నవ సమాజ నిర్మాణానికి ఓటే ఆయుధం
ప్రజాస్వామ్యానికి పునాదిరాయి లాంటి ఓటును అమ్ముకోవద్దని....ప్రలోభాలకు లొంగద్దంటూ తమ పాటల ద్వారా ప్రజల్లో ఓటుపై అవగహన కలిగిస్తున్నారు. ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటేయాలని కోరుతున్నారు.
నవ సమాజ నిర్మాణానికి ఓటే ఆయుధం
ఇదీ చూడండి : ఈ బెలూన్లను ఎట్టి పరిస్థితిలోనూ తాకొద్దు