జనగాం జిల్లా పాలకుర్తి రాజీవ్ చౌరస్తాలో కరోనా వైరస్ కట్టడికి పోలీసులు వినూత్న ప్రచారం చేశారు. సీఐ రమేష్ నాయక్ ఆధ్వర్యంలో చిందు యక్షగానం కళాకారులతో అవగాహన కల్పించారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా బారిన ఎలా పడతారో వివరించారు.
కరోనా వ్యాప్తి నివారణకు యక్షగానంతో అవగాహన - యక్షగానం కళాకారులతో కరోనాపై అవగాహన
కరోనా వ్యాప్తి నివారణకు పాలకుర్తి పోలీసులు యక్షగాన కళాకారులతో అవగాహన కల్పించారు. పట్టణంలో వీధివీధి తిరుగుతూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ప్రజలకు వివరించారు.
![కరోనా వ్యాప్తి నివారణకు యక్షగానంతో అవగాహన awareness on corona spread with yakshaganam artists](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6810561-thumbnail-3x2-asdf.jpg)
కరోనా వ్యాప్తి నివారణకు యక్షగానంతో అవగాహన
కరోనా వైరస్ వ్యాప్తి, నివారణకు దర్దేపల్లి గ్రామానికి చెందిన చిందు కళాకారుల బృందంతో పాలకుర్తిలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కృష్ణా, అర్జున, తదితర వేషధారణలో వీధివీధి తిరుగుతూ అవగాహన కల్పించారు. ఎస్సై గండ్రాతి సతీష్, సిబ్బంది పాల్గొన్నారు.
కరోనా వ్యాప్తి నివారణకు యక్షగానంతో అవగాహన
ఇదీ చూడండి:బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మితే హత్యాయత్నం కేసు