జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం తాటికొండ గ్రామం నుంచి స్టేషన్ ఘనపూర్‌కు ఏడుగురు ప్రయాణికులతో వస్తున్న ఆటో దేవాదుల జలాశయంలోకి దూసుకెళ్లింది. ముందు టైరు ఒక్కసారిగా పగిలిపోవడం వల్ల అదుపుతప్పి కాలువలో పడిపోయింది. ఆటో వెనకాలే వస్తున్న వాహనదారులు వెంటనే స్పందించి జలాశయంలో పడిపోయిన ప్రయాణికులను రక్షించారు. ప్రమాదంలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఆసుపత్రికి తరలించారు. ఆటోలో పరిమితి కంటే ఎక్కువగా ప్రయాణికులు ప్రయాణిస్తున్నారని స్థానికులు తెలిపారు.
దేవాదులలోకి దూసుకెళ్లిన ఆటో... తరువాత ఏమైందంటే..! - దేవాదుల జలాశయంలోకి దూసుకెళ్లిన ఆటో
ముందు టైరు పగిలిపోయి ఓ ఆటో దేవాదుల జలాశయంలోకి దూసుకెళ్లింది. ఆటో వెనకాలే వస్తున్న వాహనదారులు నీటిలో మునిగిపోతున్న ప్రయాణికులను రక్షించడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
దేవాదుల జలాశయంలోకి దూసుకెళ్లిన ఆటో